LOVE Kavitha prema telugu
నీ జ్ఞాపకాల వెతుకులాటలో
గొంతెండిన పాటను నేను...
నువ్వనే వర్షపు చినుకు కోసం
యేళ్ళ తరబడిన నీ ఊహల
నిరీక్షణ నేను....
పాట నాకు రాదు
కానీ
నీ పేరువింటే చాలు గుండెలోతులనుండి సంగీతం ఉప్పొంగుతుంది......
భావమేదో తెలియదు కనీ
ఏదో చెప్పాలనే ఆరాటం నాది
అయినా
నా పిచ్చి కానీ ,
ఇంకా ఎవరిని కదిలించాలని.......??
ఈ నా
ఎడారిలో ఎండమావి కవిత......!!!

0 Comments